రాష్ట్రంలో మనుషుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో డీజీపీ పాల్గొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 953 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటికి 1397మందిని రక్షించామన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 1043 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ తెలిపారు.