ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టేది లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2017, 06:18 PM

తిరుమల: డ్రగ్స్ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్సష్టం చేశారు. డ్రగ్స్ కేసులో ప్రముఖ నటులను వదిలిపెట్టి చిన్న నటులనే లక్ష్యంగా పెట్టుకున్నారని వస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియన్ గా తీసుకుందని..ఇందులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నాయిని తెలిపారు. మియాపూర్ స్కాం తెరపైకి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చిందనడంలో ఎంతమాత్రం నిజం లేదని స్ఫష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్థి చెందని విధంగా తెలంగాణా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్థి పథంలో నడిపిస్తున్నారని నాయిని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com