హైదరాబాద్: ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ తరువాత మహిళా క్రికెట్ పట్ల ఆదరణ పెరగడం పట్ల భారత కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక మంచి పరిణామంగా ఆమె అభివర్ణించారు. మనకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నందునే వరల్డ్ కప్ లో ఆకట్టుకున్నామని మిథాలీ అన్నారు. అదే సమయంలో భారత్ లో మహిళా క్రికెట్ కు ఆదరణ కూడా పెరగడం శుభసూచకమన్నారు. హైదరాబాద్ నుంచి అధిక స్థాయిలో క్రీడాకారులు తయారు కావడానికి కారణం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహమేనన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహించడం ఆయా క్రీడాకారులు తమ అదృష్టంగా భావిస్తున్నానని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానిదేనన్నారు.మరొకవైపు తమకు ఇక్కడ మీడియాకు అండగా ఉండటం అభినందనీయమని మిథాలీ తెలిపారు. కాగా, భారత్ లో క్రీడాకారులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుండటం దురదృష్టకరమన్నారు.ఇక్కడ క్రీడాకారులు భారీ సక్సెస్ సాధించిన తరువాతే వారిని గుర్తిస్తారన్నారు. అదే విదేశాల్లో అయితే యుక్త వయసు నుంచి క్రీడాకారుల పట్ల శ్రద్ధ చూపెట్టి, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారన్నారు.