చండీఘడ్: మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఘనంగా సన్మానించింది పంజాబ్ ప్రభుత్వం. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌కు అయిదు లక్షల చెక్‌ను అందజేశారు. అంతే కాదు ఆమెకు పోలీస్‌శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు. వరల్డ్‌కప్‌లో కౌర్ అద్భుతంగా ఆడిందని, హర్మన్ పంజాబ్ అమ్మాయి కావడం గర్వంగా ఫీలవుతున్నానని, ఆమె ఇక నుంచి పర్మనెంట్‌గా పంజాబ్ పోలీస్‌శాఖలో ఉండిపోతుందని సీఎం అమరేందర్ తెలిపారు.ఇటీవల ముగిసిన మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ అత్యద్భుతంగా రాణించింది. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆమె అజేయంగా 171 రన్స్ చేసిన విషయం తెలిసిందే.