ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇషాంత్ స్లెడ్జింగ్ చేస్తుంటే ఊరుకోవాలా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 08:35 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది జరిగిన టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య కవ్వింపు చర్యలు అభిమానుల్ని ఆకర్షించడమే కాదు.. సిరీస్‌లోనే వేడి పుట్టించింది. బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్‌‌స్మిత్‌కి బంతిని విసిరిన అనంతరం ఇషాంత్ చిత్రంగా ముఖ కవలికలు ప్రదర్శించగా.. దానికి ప్రతిగా స్మిత్ కూడా అదే రీతిలో ముఖ కవలికలతో అనుకరించి నవ్వులు పూయించాడు. తాజాగా ఆ ఘటనపై స్టీవ్‌స్మిత్ మాట్లాడాడు.


‘ఎవరైనా నా హావభావాలను అనుకరించాలని చూస్తే నేను వెంటనే ప్రతిస్పందిస్తాను. ఆ రోజు ఇషాంత్ శర్మ కూడా నా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చిత్రంగా ముఖ కవలికలు ఉంచాడు. దానికి వెంటనే నేను అదే రీతిలో బదులిచ్చాను. ఆ సిరీస్ సాంతం చాలా ఒత్తిడితో కొనసాగింది. పరుగులు చేస్తున్నా.. ఏదో ఒక వివాదం తెరపైకి వచ్చేది. అయితే.. అవన్నీ ఆటలో భాగమే’ అని స్టీవ్‌స్మిత్ వివరించాడు. డీఆర్ఎస్ కోరే సమయంలో డ్రెస్సింగ్ రూము సాయం కోరుతూ స్టీవ్‌స్మిత్ దొరికిపోవడంతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com