హైదరాబాద్: చైతన్యపురిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్ మార్గంలోని స్నేహపురి కాలనీ జంక‌్షన్ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు రోడ్డు దాటుతున్న వ్యాగనార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాగనార్ కారులో ఉన్న ప్రశాంత్, హర్షిణి, చంద్రకళ, శ్రీకాంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కొత్తపేట్‌లోని ఓమిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa