ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 11:53 AM

హైదరాబాద్‌ : మెట్రో రైల్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో అమీర్‌పేటలోని మైత్రివనం కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్ళింపులు విధించారు. ఇవి గురువారం నుంచి 45 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరించాలని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం కోరారు.


1. ఎర్రగడ్డ, అమీర్‌పేట వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్ళే వాహనాలను ఎస్సార్‌నగర్‌లోని ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి ఎస్సార్‌నగర్‌ ఠాణా, ఎస్సార్‌నగర్‌ టి జంక్షన్, సత్యం థియేటర్, దుర్గామాత టెంపుల్‌ మీదుగా పంపిస్తారు. ఈ మార్గం వన్‌వేగా ఉండే నేపథ్యంలో దీనికి వ్యతిరేక దిశలో వాహనాలు అనుమతించరు.


2. ఫతేనగర్‌ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను సత్యం థియేటర్‌ వైపు అనుమతించరు. వీటిని బల్కంపేట ఆర్‌ అండ్‌ బీ ఆఫీస్, డీకే రోడ్, జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్‌ మీదుగా పంపిస్తారు.


3. ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కళ్యాణ్‌నగర్‌ వైపు వెళ్ళే తేలికపాటి వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఉమేష్‌ చంద్ర విగ్రహం చౌరస్తా నుంచి కుడి వైపునకు భారీ వాహనాలను ఎడమ వైపునకు మళ్లిస్తారు.


4. జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్, అమీర్‌పేట–సోనాబాయ్‌ టెంపుల్‌ మధ్య ఇరుకైన రోడ్డు కావడంతో దీన్ని వన్‌వేగా చేస్తున్నారు. సోనాబాయ్‌ టెంపుల్‌ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.


5. బేగంపేట నుంచి ఎస్సార్‌గనర్, యూసుఫ్‌గూడ వైపు వెళ్ళే వాహనాలను సత్యం థియేటర్‌ వైపు అనుమతించరు. వీటిని దుర్గామాత దేవాలయం నుంచి మైత్రివనం వైపు మళ్ళిస్తారు.


6. ఉమేష్‌చంద్ర విగ్రహం చౌరస్తా, ఎస్సార్‌నగర్‌ టి జంక్షన్‌ మధ్య ఉన్న బై లైన్‌ రోడ్స్‌లో కమ్యూనిటీ హాల్‌ రోడ్‌ మినహా మిగిలినవి మూసేస్తారు.


7. అమీర్‌పేట జంక్షన్‌ నుంచి మైత్రివనం, ఎస్సార్‌నగర్‌ వైపు వెళ్ళే వాహనాలు యథావిధిగా ప్రయాణిస్తాయి.  


8. ట్రాఫిక్‌ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తగిన రూట్లు ఎంపిక చేసుకుంటే మంచిది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa