హైదరాబాద్: నగరంలోని మహేశ్వరంలో ఉన్న హార్డ్ వేర్ పార్కులో కల్యాణి రాఫెల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇజ్రాయిల్ అంబాసిడర్ డానియల్ కార్మన్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలను తాము కల్పిస్తామన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన కల్యాణి రాఫెల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కు ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. వర్ధమాన పారిశ్రామిక వేత్తలను తెలంగాణ ఆహ్వానిస్తున్నదని మంత్రి చెప్పారు. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అంటూ ఆయన వివరించారు. అవసరమైన అన్ని అనుమతులను దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని మంత్రి తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa