జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు చేశారు. . 11:20 గంటలకు కోహీర్ మండలంలోని కొత్తూర్(డి) గ్రామంలో టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించారు. 11:30 గంటలకు కవేలి చౌరస్తాలోని హోటల్ మేనేజమేంట్ కళాశాలను ప్రారంభించారు. 12:10 గంటలకు దిగ్వాల్ గ్రామంలో మార్కెట్‌శాఖ గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి 12:30 గంటలకు పస్తాపూర్ చేరుకుని గ్రామంలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం పనులను భూమి పూజ చేస్తారు. 1:10 గంటలకు హోతి(కే) శివారులో ఉన్న మార్కెట్ గోదాంను ప్రారంభిస్తారు. 1:30 రాయిపల్లితండా రోడ్డుకు భూమి పూజ చేస్తారు. 2:10 కాశీంపూర్‌కు మురికి కాల్వ నిర్మాణం పనులు ప్రారంభం. 2:30 పండ్లు మార్కెట్లో హరితహారంలో మొక్కలు నాటుతారు. 2:40 ప్రభుత్వ దవాఖానలో అత్యవసర కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 3:30 గంటలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే గీతారెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కే.మాణిక్‌రావు, జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.లక్ష్మా రెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్‌లు కార్యక్రమానికి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa