తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1 లో 57.37 శాతం అభ్యర్థులు పాసయ్యారు. పేపర్-2లో 19.51 శాతం మంది ఉత్తర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే పేపర్-2లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. పేపర్-1 లో ఉత్తీర్ణతలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానం సాధించ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చివరిస్థానంలో నిలిచింది. పేపర్-2లో మంచిర్యాల జిల్లా మొదటి స్థానం, సిద్దిపేట జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. చాలామంది అభ్యర్థులు డబుల్ బబుల్స్ చేశారని, వనపర్తిలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని కిషన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa