శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధనుంజయ డిసిల్వా ఎదుర్కొన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా టెస్టు కెరీర్‌లో 150వ వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 32వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న జడేజా.. ఈ వికెట్‌తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.జడేజా కంటే ముందు.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 29 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకోగా.. జడేజా తర్వాత.. ఎర్రపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే సంయుక్తంగా 34 టెస్టుల్లో, హర్భజన్ సింగ్ 35 టెస్టుల్లో ఈ 150 వికెట్ల మైలురాయి అందుకున్న వారి జాబితాలో వరుసగా ఉన్నారు. అయితే ఎడమ చేతి వాటం స్పిన్నర్ల జాబితాలో మాత్రం జడేజానే ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 40 టెస్టుల్లో అందుకున్న రికార్డుని జడేజా తుడిచిపెట్టేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa