ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమ‌ర్శ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2017, 04:06 PM

హైదరాబాద్‌: కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై సీబీఐ కేసులు ఉండటం వల్లనే కేంద్రం వద్ద కేసీఆర్‌ మోకరిల్లుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2011లో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని మూడుసార్లు విచారించారని తెలిపారు. నోట్లరద్దు, జీఎస్టీ బిల్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇలా ఏవి తీసుకున్నా భాజపా పాలిత రాష్ట్రాల సీఎంల కంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి మద్దతు పలుతున్నారని అన్నారు.


  జీఎస్టీ అమలు రాష్ట్రంలోని నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బిల్లుకు ఆమోదం తెలిపినప్పుడు కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలపై 18శాతం జీఎస్టీ విధించడం వల్ల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పినా.. మరుసటి రోజు ఎలాంటి ప్రభావం చూపదని సీఎస్‌ ఎందుకు ప్రకటన జారీ చేశారని నిలదీశారు. తాము చేస్తున్న ఆరోపణలు నిజం కాదనుకుంటే కేసులు పెట్టుకోవచ్చని రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa