ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన ఎంపీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2017, 10:34 AM

జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు ట్రాక్టర్లలో పోచంపాడ్‌లో నిర్వహిస్తున్న సీఎం సభకు తరలివెళుతున్నారు. ట్రాక్టర్ల ర్యాలీని పార్లమెంట్ సభ్యురాలు కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రైతులకు నీరు ముఖ్యమని, నీళ్ల కోసం బోర్లు వేసే కాలం ఇక ముందు ఉండదని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం ద్వారా ఏడు జిల్లాల రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చే బృహత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa