ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో అతి త్వరలో పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. కాగా ఇప్పటికే ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.295 లో యూజర్లకు లభిస్తున్నది. వాట్సాప్ బీటా వెర్షన్ యాప్ను వాడుతున్న వారు పేమెంట్స్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ, ఆధార్ అనుసంధానంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీంతో యూజర్లు ఒకరికొకరు సులభంగా నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బిల్స్ చెల్లింపులు కూడా చేయవచ్చు. గత కొంత కాలంగా వాట్సాప్లో ఊరిస్తూ వస్తున్న పేమెంట్స్ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్లో లభిస్తుండగా, త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.