ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలిపిన కె.కె

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 02:09 PM

రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్యనాయుడు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు ఎంపీ కేశవరావు చెప్పారు. గత 50 ఏళ్లుగా వెంకయ్యనాయుడితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టినందుకు వెంకయ్యనాయుడికి  ఎంపీ కేకే అభినందనలు తెలిపారు. అధికార పక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ విపక్షాలకు కూడా తమ వాదన వినిపించేలా సభను సమర్ధవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa