భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న గ్ర‌హ‌శ‌క‌లం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:23 PM
 

హైద‌రాబాద్: గ్ర‌హ‌శ‌క‌లాలు భూమికి స‌మీపంగా వెళ్ల‌డం స‌హ‌జ‌మే. అయితే ఈసారి ఓ ఇల్లంత సైజు ఉండే మ‌రో గ్ర‌హ‌శ‌క‌లాం భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. అక్టోబ‌ర్ 12వ తేదీన ఆ గ్ర‌హ‌శ‌క‌లం చంద్రుడి క‌క్ష్య నుంచి వెళ్ల‌నున్న‌ట్లు యురోపియ‌న్ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. భూమికి సుమారు 44 వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి ఆ గ్ర‌హ‌శ‌క‌లం వెళ్తుంద‌న్నారు. అయితే దీని వ‌ల్ల‌ జియోస్టేష‌న‌రీ శాటిలైట్ల‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని కూడా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. జియోస్టేష‌న‌రీ ఉప‌గ్ర‌హాలు సుమారు 36 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటాయి. కానీ గ్ర‌హ‌శ‌క‌లం 44 వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్తుండ‌డం వ‌ల్ల వాటికి ఎటువంటి ప్ర‌మాదం లేదు. 2012 అక్టోబ‌ర్‌లో టీసీ4 అనే గ్ర‌హ‌శ‌క‌లం భూమికి చేరువ‌గా వెళ్లింది. అది సుమారు 30 మీట‌ర్ల పొడుగు ఉన్న‌ట్లు గుర్తించారు.