యాదాద్రికి పోటెత్తిన భక్తులు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 01:15 PM
 

యాదాద్రి భువ‌న‌గిరి: వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావ‌డంతో యాదాద్రి లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. అధిక సంఖ్య‌లో భ‌క్తులు యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి త‌ర‌లివ‌చ్చారు. దీంతో స‌ర్వ‌ద‌ర్శ‌నానికి నాలుగు నుంచి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. ఇక‌.. పోటెత్తిన భ‌క్తుల‌తో యాదాద్రి క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.