నగరంలోని ధర్నా చౌక్ వద్దా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 01:36 PM
 

శాంతియుతంగా అమరవీరుల స్పూర్తి యాత్ర చేడుతున్న  కోదండారాం ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ లో వామపక్షాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ధర్నా చౌక్ వద్దా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తున్నడనే అక్కసుతోనే జేఏసి చైర్మన్ కోదండారాం ను అరెస్ట్ చేశారని ఇలాంటి అక్రమ అరెస్టులను ఇప్పటికైనా ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు . అరెస్ట్ చేసిన కోదండారాం ను వెంటనే విడుదల చేయాలని లేని ఎడల ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.