రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా శరద్ యాదవ్ కు ఉద్వాసన

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:14 PM
 

పాట్నా : రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా శరద్ యాదవ్ ను తొలగించి ఆయన స్థానంలో రామ్ చంద్రప్రసాద్ ను పార్టీ నియమించింది. పార్టీ అధిేనేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ యాదవ్ మహాఘట్ బంధన్ నుంచి వైదొలగి బీజేపీ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న శరద్ యాదవ్ ను పార్టీ రాజ్యసభాపక్ష నేతగా తొలగించినట్లు జేడీయే బీహార్ అధ్యక్షుడు వసిష్ట నారాయణ తెలిపారు. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి శరద్ యాదవ్ ను రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా తొలగించి ఆయన స్థానంలో రాం చంద్ర ప్రసాద్ సింగ్ ను నియమించినట్లు రాతపూర్వకంగా తెలియజేసినట్లు ఆయన తెలిపారు.