ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరి మృతి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 06:15 PM
 

ఖమ్మం జిల్లా గార్ల ఒడ్డు కూడలిలో అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. సైకిల్‌, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా కారులో ఉన్న ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయపడ్డారు. ప్రమాదం తర్వాత బస్సు కూడా ఓ పక్కకు దూసుకుపోయింది. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి మణుగూరు వెళ్తున్న బస్సు వేగంగా వస్తూ గార్ల ఒడ్డు కూడలిలో సైకిల్‌ను ఢీకొంది. అదే సమయంలో ఖమ్మం వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి రహదారి పక్కన ఓ ఇంటి సమీపం వరకు దూసుకెళ్లింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో రెండు రోజుల క్రితమే లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు.