బాసర ఆలయాన్ని రూ.125 కోట్లతో అభివృద్ధి చేస్తాం: ఎంపీ కవిత

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 11:50 AM
 

బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.125 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు ఈ రోజు ఆమె బాసరకు వెళ్లారు. ఈ సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో కవిత మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సీఎం కేసీఆర్ త్వరలోనే ఇక్కడ పర్యటిస్తారని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.