అగ్ని ప్ర‌మాదంలో రెండు పూరిండ్లు ద‌గ్ధం

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 12:24 PM
 

సూర్యాపేట: అగ్నిప్ర‌మాదంతో రెండు పూరిండ్లు ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న జిల్లాలోని మున‌గాల మండ‌లం నారాయ‌ణ‌గూడెం లో జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో రెండు పూరిండ్లు పూర్తి గా కాలిపోయాయి. అయితే.. మంట‌ల ఇంట్లోకి వ్యాపించ‌డంతో వెంట‌నే ఇంట్లో ఉన్న‌వాళ్లు అందులోనుంచి బ‌య‌టి ప‌రుగులు తీయ‌డంతో అగ్ని ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.