న‌లుగురు పోలీస్ అధికారుల‌పై కేసు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 05:56 PM
 

హైద‌రాబాద్ రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో న‌లుగురు పోలీస్ అధికారుల‌పై కేసు న‌మోద‌యింది. రాయ‌దుర్గం సీఐ దుర్గ ప్ర‌సాద్, సైబ‌రాబాద్ అద‌న‌పు డీసీపీ పులింద‌ర్, ఎస్ఐ రాజ‌శేఖ‌ర్, కానిస్టేబుల్ ల‌క్ష్మీనారాయ‌ణ పై కేసు నమోద‌యింది. భూ వ్య‌వ‌హారంలో బ‌ల‌వంతంగా చెక్కుల‌పై సంత‌కాలు పెట్టించార‌ని సైబ‌రాబాద్ సీపీని బాధితులు ఆశ్ర‌యించారు. దీంతో ఈ న‌లుగురిపై కేసు న‌మోదు చేయాల‌ని మాదాపూర్ ఏసీపీని సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు. ఐపీసీ సెక్ష‌న్ 448, 365, 342, 384, 506, ఆర్/డ‌బ్ల్యూ 149 సెక్ష‌న్ కింద వీళ్ల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఏసీపీ తెలిపారు.