ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 06:34 PM

నిరుపేదలకు డబుల్‌  బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పోచారం పాల్గొన్నారు. సంగం గ్రామంలో డబుల్‌  బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాడ్కోల్‌  గ్రామ శివారులో 500 డబుల్  బెడ్రూం ఇళ్ళ నిర్మాణానికి సబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు. దేశాయ్‌  పేటలో గ్రామపంచాయతి  నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలువురు అధికారులు, స్థానికులు ఇందులో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa