హైదరాబాద్: నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) నగరంగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీ నోటిఫికేషన్ ను ఇవాళ జీహెచ్ఎంసీ జారీ చేసింది. నగర ప్రజల నుంచి ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) పైన సలహాలు, సూచనలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ మల మూత్ర విసర్జన ను కంట్రోల్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. దానిలో భాగంగా నగరంలోని 295 పెట్రోల్ పంపులకు, 390 హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్లకు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని జీహెచ్ఎంసీ సూచించినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa