వరంగల్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.15 గంటలకు జనగాంలోని ఓబులకేశవాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు హన్మకొండ, సుబేదారి రాయల్ ఫంక్షన్ హాల్ లో ఓ వివాహ మహోత్సవానికి హాజరవుతారు. ఉదయం 11.30 గంటలకు హసన్ పర్తిలో మీజిల్స్, రూబెల్లా వ్యాక్సిన్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హసన్ పర్తి, చింతగట్టు క్యాంప్, బిజీఆర్ రాక్ గార్డెన్స్ లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి కొడుకు క్రాంతి రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హన్మకొండ, గుండ్ల సింగారం లో తీజ్ ఉత్సవాల్లో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa