ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెప్సీ, కోక్‌లను బహిష్కరించిన తమిళనాడు ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 03:10 PM

స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలని పెప్సీ, కోక్ కంపెనీలను బహిష్కరిస్తున్నట్లు తమిళ వ్యాపారులు వెల్లడించారు.  దీంతో పెప్సీ, కోక్‌లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది.  రాష్ట్రంలోని అతి పెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ పెప్సీ, కోక్‌లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ సంఘంలో ఆరు వేలకు పైగా చిన్న మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు.  చిన్న చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ  డ్రింక్స్ అమ్మబోరని  సంఘం స్పష్టం చేసింది.  పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా, తాము అంగీకరించలేదని సంఘం వెల్లడించింది.  గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa