హైదరాబాద్ నగరంలో 2 లక్షలకు పై చిలుకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మట్టి వినాయకులపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేశ్ స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. శిల్ప కళా వేదికలో 14 స్టాళ్లను జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... హైదరాబాద్ లో గతంలో ఎన్నో చెరువులు, కొలనులు ఉండేవన్నారు. కాలుష్యానికి దూరంగా ఆది దేవుడి పండుగ జరుపుకుందామన్నారు. మార్పు అనేది చిన్నప్పుడే మొదలవ్వాలన్నారు. హైదరాబాద్ మహా నగర జనాభా కోటి దాటిందని చెప్పారు. కాలుష్య నివారణ కోసం 25 గణేశ్ నిమజ్జన ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన తెలియజేశారు. మట్టి గణపతి విగ్రహాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేస్తున్నదన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 2 లక్షల కు పైగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa