ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 పబ్బులకు అధికారులు నోటీసులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 02:51 PM

మాదకద్రవ్యాల కేసులో విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో 16 పబ్బులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయని గతంలోనే గుర్తించిన సిట్ అధికారులు ఇదివరకు ఒకసారి కొన్ని పబ్బులను విచారణకు పిలిచారు. మరికొన్ని పబ్బుల యజమానులను పిలిచి హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు పెట్టని, పెట్టినా ఆఫ్ చేసే ప్రతి పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా కెమెరాలకు పవర్ కట్ చేయడం లేదా? కెమెరాలు పని చెయ్యకుండా చేయడం చేస్తుండడం పట్ల వివరణ ఇవ్వాలని 16 పబ్బులను ఆదేశించారు. ఈ జాబితాలో గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో ఉన్నాయి. ఓవర్ ద మూన్, క్లబ్ ఎక్స్ త్రీ, హైడ్రోజన్, ట్రియో ఎఫ్ క్లబ్, ఆక్వా కిస్మత్, ఓటీఎం, క్లబ్ ఆర్, హై లైఫ్, బీటీఎం ఎయిర్ లైన్ తదితర పబ్ లకు నోటీసులు జారీ చేశారు. అలాగే కొన్ని పబ్ ల లైసెన్సులు రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa