ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 05:38 PM

హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ పర్యటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న వెంకయ్య నాయుడు పౌరసన్మానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున వెంకయ్యనాయుడికి పౌరసన్మానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల 21న ఉపరాష్ట్రపతికి బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వాగత కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెంకయ్య వెళ్తారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరఫున రాజ్‌భవన్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి గౌరవార్థం దిల్‌ఖుష్ అతిథిగృహం ప్రాంగణంలో విందు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లుచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa