లక్నో : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో నేడు పర్యటించనున్నారు. గోరఖ్ పూర్ ఆసుపత్రిలో ఇటీవల వారం రోజుల వ్యవధిలో 79 మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. మెదడు వాపు వ్యాధి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన చిన్నారుల మరణానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడమే కారణమన్న ఆరోపణలు వినవచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గోరఖ్ పూర్ ఆసుపత్రిని సందర్శిస్తారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.