హైదరాబాద్: ఫొటోగ్రాఫర్ల విధి నిర్వహణ ఎంతో కష్టమైనదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటుచేసిన ఛాయ చిత్ర ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల్ని ప్రదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. బతుకమ్మ సందర్భంగా జాగృతి తరఫున ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు ఇవ్వనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa