హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంపై అల్పపీడనం కేంద్రీకృతమైంది. నైరుతి దిశగా ఎగువకు ఉపరితల ఆవర్తనం కదులుతుంది.