ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాదీముబారక్ వంటి పథకం మైనార్టీ కుటుంబాల్లో సంతోషం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 04:46 PM

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో ముస్లిం నేతలకు అవకాశం కల్పించారని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులే కాకుండా అనేక పదవులను మైనార్టీలకు సీఎం ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ధ్వజమెత్తారు. మైనార్టీ విద్యార్థుల కోసం భారీగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. షాదీముబారక్ వంటి పథకం మైనార్టీ కుటుంబాల్లో సంతోషం నిపిందన్నారు. మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా సీఎం ముందుకు పోతున్నారని ఉద్ఘాటించారు. 


గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని చేతి, కుల వృత్తులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారని తెలిపారు. 70 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నామినేటేడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గొర్రెల, చేపల పెంపకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ వర్కర్లు, వీవోఏలకు జీతాలు పెంచారని గుర్తు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa