అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ వీకే శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు అందుతున్నాయన్న వార్తలను ఆమె ఉంటున్న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులు ఖండించారు.
శశికళను జైల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా అంటూ తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎంపీ రాజవేలాదం ఆర్టీఐ కింద ఆర్జీ పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జైలు డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ సమాధానం ఇచ్చారు.
శశికళ ఉంటున్న బ్యారక్ లో టీవీ తప్ప..మంచం, ఫ్యాన్, ఏసీ, వాటర్ హీటర్, ప్రత్యేక బాత్రూంలాంటి ప్రత్యేక వసతులేవీ కల్పించడం లేదని స్పష్టం చేశారు. శశికళను బెంగళూరు నుంచి తమిళనాడుకు తరలిస్తారని వస్తున్న వార్తలను కూడా జైలు అధికారులు ఖండించారు. శశికళను తమిళనాడుకు తరలించాలని తమకు ఏలాంటి లేఖ అందలేదని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 20న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను శశికళతో మాట్లాడేందుకు 35 నుంచి 40 నిమిషాలు అనుమతించినట్లు అధికారులు ధృవీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa