ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక తెలంగాణ అభివృద్ధి కోసమే పాదయా్త్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:34 AM

సూర్యాపేటప్రతినిధి,మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ, ఎంబీసీల అభివృద్ధి కోసమే మహాజన పాదయాత్రను ప్రారంభించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం మండల పరిధిలోని బాలెంల గ్రామంలో జరిగిన బ„హిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణరాష్ట్రంలో అధికంగా ఉండే బీసీ, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి చట్టంతీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు అదికారులు గుత్తేదారులకు లబ్దిచేకూరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా చివరి బూములకు నీరందించేందుకు నీటిని చెరువులు, కుంటలు నింపాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించి వారి అభివృద్ధిని అడ్డుకున్నారని.. ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని ధుమ్మెత్తిపోశారు. గ్రామజ్యోతి, మన ఊరు ప్రణాళికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి చూసినా కనీసం సీసీ రోడ్లు లేవని తెలిపారు. మంచినీటి సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. మూడెకరాల బూమి దళితులకు ఇస్తానని చెప్పి కనీసం ఇల్లు నిర్మించుకునేందుకు గుంటభూమి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు ములకలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు,  మల్లు నాగార్జునరెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, మల్లు లక్ష్మి, వెంకట్‌, సుందరయ్య, కాంపాటి శ్రీను, నంద్యాలవెంకటరెడ్డి, చెరుకు సత్యం, ఏకలక్ష్మి, మేకనబోయిన శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa