హైదరాబాద్ పాతబస్తీలో ప్రేమోన్మాది బరితెగించాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. శాలిబండ పీఎస్ పరిధిలోని ఖాజిపురలో ఈ దారుణం చోటు చేసుకుంది. అసిఫ్ నగర్‌కు చెందిన అంజాద్, అయేషా ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అయేషా తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో… అంజాద్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అంజాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై నిర్భయ యాక్ట్ తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa