ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏరియా రక్షణ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:41 PM

శత్రు క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకునే అధునాతన ఏరియా రక్షణ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్‌కలాం ప్రయోగకేంద్రం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణశాఖ తెలిపింది.  ప్రయోగం విజయవంతమైందని వెల్లడించింది. ఆకాశంలో గరిష్ఠంగా 15 కి.మీ. ఎత్తువరకు శత్రు క్షిపణులను ఛేదించడం మన క్షిపణి ప్రత్యేకత అని డీఆర్డీవో అధికారులు తెలిపారు.  ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సంతృప్తి వ్యక్తం చేసి.. డీఆర్డీవో సిబ్బందికి, శాస్త్రవేత్తలకు, ప్రాజెక్టు అధికారులకు అభినందనలు తెలియజేశారని చెప్పారు. ఈ నూతన ఆవిష్కరణ విజయవంతం కావడంపై డీఆర్డీవో చైర్మన్, రక్షణశాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ కూడా అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. క్షిపణి-వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్, రక్షణశాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీశ్‌రెడ్డి తన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి స్వయంగా క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa