కాంగ్రెస్ నాయకులు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాదిలోగా సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెస్తామని చెప్పారు. సిద్దిపేటలోని నర్సాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న అత్యాధునిక మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటితో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్రంలోని గర్భిణులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు వారికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa