ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ సీఎం తల తెస్తే రూ. కోటి నజరాన!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 05:37 PM

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కుందన్‌చందావత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ సీఎం విజయన్ తల నరికి తీసుకొచ్చినవారికి కోటికిపైగా ఉన్న తన ఆస్తి మొత్తం రాసిస్తానని ఆయన అన్నారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల హత్యలకు విజయన్నే కారణమని కుందన్ ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత ప్రకటన అని భగత్ సింగ్ బ్రిటిష్ వారిపై బాంబు వేసినట్లు తాను ఓ సంచలన ప్రకటన చేశానని ఆయన అన్నారు. హిందువులేమీ నిద్ర పోవడం లేదని వాళ్లు తెలుసుకోవాలని కుందన్ అన్నారు. కాగా, కుందన్ వ్యాఖ్యలపైనా ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపైనా సీపీఎం నేతలు మండిపడుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa