హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణవాసులు రాష్ట్ర పండుగైన బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక వేడుకైన పూలజాతర నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ఆఫ్రికా(టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో గౌతెంగ్ ప్రాంతంలో ఒక్కటిగా చేరి బతుకమ్మను వేడుకగా జరుపుకున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను ఓచోట చేర్చి మహిళలంతా ఆడిపాడారు.