హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారుల భార్యలు, మహిళా పోలీస్ ఆఫీసర్లు, డీజీపీ ఆఫీస్ మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఐపీఎస్ అధికారుల భార్యలు బతుకమ్మ ఆడుతూ ఉత్సాహం నింపారు.