గచ్చిబౌలి షర్టాన్ హోటల్ లో సర్వ ఫ్యాషన్ షో అలరించింది. నగరానికి చెందిన ఫేమస్ డిజైనర్ శ్రీకాంత్ రూపొందించిన దుస్తులతో మోడల్స్ ర్యాంప్ పై హోయలొలికించారు. ముఖ్యంగా వధువరులు ధరించే వస్త్రాలు హైలెట్ గా నిలిచాయి. సినీ నటులు శ్రీధర్ రావు, పూజశ్రీ లు సైతం శ్రీకాంత్ డిజైన్లను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. అందరికి నచ్చేలా మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని డిజైన్లను రూపొందించానని శ్రీకాంత్ తెలిపారు.