బతుకమ్మ ఉత్సవాలు సిడ్నీలో ఘనంగా జరిగాయి. బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించిపోయింది. ఆటపాటలు, కోలాటాల మధ్య అక్కడి వీధులు మార్మోగాయి. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు ఆడారు మహిళలు. నిర్వాహకులు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి.. మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనిల్ మునగాల మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను సిడ్నీలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం గొప్పగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవహారాలను విదేశాలకు పరిచయం చేయించడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోడి మక్కే, జియోఫ్ లే, హుగ్ మక్డాట్తో పాటు ఇండియన్ హైకమిషన్ కార్యదర్శి పాల్గొన్నారు.