ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ బాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 06:09 PM

పోలీసులు మరో నకిలీ బాబా ఆట‌క‌ట్టించారు. జ్యోతిష్యం చెబుతానంటూ దరిద్రాన్ని వ‌ద‌ల‌గొడ‌తానంటూ హైద‌రాబాద్‌లోని బల్కంపేటలో ఓ బాబా జ‌నాల‌ను న‌మ్మిస్తున్నాడు. రంగురాళ్లను మహిమ గల రాళ్లు అని చెబుతున్నాడు. మంత్రాలు చ‌దువుతూ ఒక్కో రాయిని ప‌దివేల రూపాయ‌లకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నాడు. ఈ విష‌యం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు అత‌డిని అరెస్టు చేసి వివ‌రాలు తెలిపారు. హైద‌రాబాద్‌లోని చార్మినార్‌ వద్ద, అమెజాన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆ బాబా రంగురాళ్లను కొనుగోలు చేసి త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు అంట‌గ‌డుతున్నాడ‌ని చెప్పారు. అత‌డి నుంచి మొత్తం 97 రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com