ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పోరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు నిర్వాహాకులు వెండి నాణెంను అందజేశారు. అదేవిధంగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలకు బంగారు నాణేలను అందించారు.