రంగారెడ్డి: షాబాద్ మండలం కొమరబండలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. గంధం మల్లేష్ (32) తన కిరాణా దుకాణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న 108 బీరు సీసాల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 96 కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్లు, 12 నాకౌట్ స్ట్రాంగ్ బీర్లు ఉన్నాయి. మల్లేశ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.