కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్ తగిలింది. అయితే సోమవారం రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి తెలుగు సినీ నటుడు మనోజ్ నందన్ కారు పూర్తిగా ధ్వంసమైంది. గచ్చిబౌలిలోని ప్రహరీ గోడ ప్రక్కన ఆయన కారు పార్క్ చేసి ఉండగా, గోడ ఒక్కసారిగా కూలి మనోజ్ నందన్ కారుపై పడింది, దీంతో ఈయన కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. భారీ వర్షాల కారణంగా గోడ కూలి చాలా కార్లపై పడింది. అందులో నా కారు కూడా ఉంది. అదృష్టవశాత్తు ఆ కారులో ఎవరు లేరు అని కామెంట్ పెట్టి తన కారుకి సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేశాడు.