ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ లావాదేవీలు జరిపితే 7 ఏళ్ళ జైలు శిక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 04:06 PM

న్యూఢిల్లీ:అక్రమ లావాదేవీలు జరిపిన ఖాతాదారులకు శిక్షలు తప్పవని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. భారీ జరిమానాతో పాటు ఏడుళ్లపాటు జైలు శిక్షలు విధించే అవకాశం లేకపోలేదని ఆదాయపు పన్నుశాఖ మరోసారి హెచ్చరికలు చేసింది.దేశంలో నల్లధనాన్ని నిర్మూలించే క్రమంలో భాగంగా కేంద్రం అనేక చర్యలను తీసుకొంటుంది. అయితే కేంద్రం తీసుకొన్న చర్యల కారణంగా పన్నులు చెల్లించకుండా అక్రమ మార్గంలో లావాదేవీలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకొంటామని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది. పెద్ద నగదునోట్ల రద్దు అంశం కూడ నల్లధనాన్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం తీసుకొచ్చింది.అయితే అక్రమార్కులు వక్రమార్గాలను ఉపయోగించి నల్లధనాన్ని మార్పిడి చేసుకొనే ప్రయత్నాలను చేశారు.అయితే ఈ మార్గాలన్నింటిపై ఆదాయపు పన్నుశాఖ కన్నేసింది. ఈ తరుణంలో అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. చట్టాలను ఉల్లంఘించినవారికి భారీ జరిమానా జైలు శిక్షలు తప్పవని ఆదాయపు పన్నుశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa