జోరుగా టీ20 టికెట్ల అమ్మకాలు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 12:42 PM
 

 రేపు ఆసీస్- భారత్‌ల మధ్య జరిగే మూడో టీ20 కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి నగరంలోని జింఖానా గ్రౌండ్‌లో టికెట్లు ఇస్తున్నారు. దీంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. కీలక మ్యాచ్ కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పలువురు బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.